Share News

ఉత్సాహంగా సదర్‌

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:17 PM

వందలాది మంది పాల్గొనగా.. దున్నపోతులు తమ విన్యాసాలతో అ లరించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నేతాజీచౌరస్తాలో యాదవసంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదర్‌ ఉత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుధ్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి పా ల్గొన్నారు.

ఉత్సాహంగా సదర్‌
జడ్చర్లలో సదర్‌ ఉత్సవంలో దున్నపోతుతో విన్యాసాలు చేయిస్తున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి

- పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి

- అలరించిన దున్నపోతుల విన్యాసాలు

- తరలివచ్చిన వందలాది మంది

జడ్చర్ల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : వందలాది మంది పాల్గొనగా.. దున్నపోతులు తమ విన్యాసాలతో అ లరించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నేతాజీచౌరస్తాలో యాదవసంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదర్‌ ఉత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుధ్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి పా ల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్చ ర్ల పట్టణంలోని చౌడమ్మగుట్ట వద్ద 33 గుంటల భూమిని యాదవ సంఘానికి కేటాయిస్తామని అన్నారు. ఆ స్థలంలో యాదవసంఘం కల్యాణమండపం ని ర్మాణం చేద్దామన్నారు. స్వంతంగా రూ. 25 లక్షలను అందచేస్తానని ప్రకటించా రు. ఈ సందర్బంగా దున్నపోతుకు ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదవ సంఘానికి కేటాయిం చేవిధంగా కలెక్టర్‌ ద్వా రా ప్రొసీడింగ్‌ తీసుకువచ్చి, అప్పగి స్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా దున్నపోతుతో విన్యాసాలు చేయించారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పుష్పలత, బాదే పల్లి మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఉత్స వంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సం దర్బంగా దున్నపోతులకు ప్రత్యేకపూజలు చేశారు. అనం తరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని సదర్‌ ఉత్స వాలను ప్రతీ సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నా మన్నారు. యాదవసంఘం నాయకులు విశ్వేశ్వర్‌యాద వ్‌, శ్రీశైలంయాదవ్‌, నరసింహయాదవ్‌, మచ్చల శ్రీను యాదవ్‌, కృష్ణయ్యయాదవ్‌, ప్రభాకర్‌యాదవ్‌తో పాటు సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:17 PM