ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యం
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:37 PM
వనపర్తి జిల్లా డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు ఆత్మకూరు పట్టణ కేంద్రంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఆత్మకూరు పట్ట ణ వాసులు, ప్రయాణికులు తెలిపిన సమా చారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
- త్రుటిలో తప్పిన ప్రమాదం
ఆత్మకూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు ఆత్మకూరు పట్టణ కేంద్రంలో తృటిలో ప్రమాదం తప్పింది. ఆత్మకూరు పట్ట ణ వాసులు, ప్రయాణికులు తెలిపిన సమా చారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆ త్మకూరు పట్టణ కేంద్రం నుంచి వనపర్తి జి ల్లా కేంద్రానికి వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ముందు భాగంలోని వీల్స్‌ను కం ట్రోల్ చేసే కింగ్ పిన్ ఊడిపోవ డంతో బస్సు అదుపుతప్పి ఆత్మ కూరు ఎస్‌బీఐ బ్రాంచి ముందు డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ చా కచక్యంగా ప్రవర్తించడంతో బస్సు లో ఉన్న ప్రయాణికులకు ప్రమా దం తప్పిం దని పలువురు అంటున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరిశీలించి ప్రయా ణికులను వేరే వా హనంలో వనపర్తి జిల్లా కేంద్రానికి పంపించారు. బస్సుకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి వనపర్తి జిల్లా కేంద్రా నికి తరలించినట్లు పట్టణవాసులు ప్రయా ణికులు తెలిపారు. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు