Share News

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ

ABN , Publish Date - May 31 , 2025 | 11:00 PM

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాల య్యాయి.

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ

- ఒకరి మృతి, మరొకరికి గాయాలు

నారాయణపేటరూరల్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాల య్యాయి. ఈ సంఘటన శనివారం నారాయణపేట మండలం చిన్నజట్రం స్టేజీ వద్ద చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బోయిన్‌పల్లి రోడ్డు నుంచి చిన్నజట్రం గ్రామంలోకి వెళ్తున్న ద్విచక్రవాహనం స్టేజీ వద్ద రోడ్డు దాటుతుండగా మరికల్‌ నుంచి నారాయణపేటకు వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న నర్సింహులు తలకు తీవ్ర గాయాలు కాగా పేట ఆస్పత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అలాగే భాస్కర్‌ అనే మరొక వ్యక్తికి స్వల్పగాయాలు కాగా, మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. విషయంపై కేసుచేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు రూరల్‌ ఎస్‌ఐ సి.రాముడు తెలిపారు.

Updated Date - May 31 , 2025 | 11:00 PM