Share News

ప్రతీ నియోజకవర్గానికి రూ.65 లక్షల నిధులు

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:00 PM

అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదని, తనకు ఎంపీ కోటా కింద వచ్చే నిధులతో ఒక్కో నియోజకవర్గానికి రూ.65 లక్షల చొప్పున నిధులు ఇచ్చి, పనులు చేస్తున్నామని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ చెప్పారు.

ప్రతీ నియోజకవర్గానికి రూ.65 లక్షల నిధులు
మాతా గంగాభవాని కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎంపీ అరుణ

ఎంపీ డీకే అరుణ

చిన్నచింతకుంటలో కమ్యూనిటీ హాల్స్‌ నిర్మాణానికి భూమి పూజ

చిన్నచింతకుంట, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదని, తనకు ఎంపీ కోటా కింద వచ్చే నిధులతో ఒక్కో నియోజకవర్గానికి రూ.65 లక్షల చొప్పున నిధులు ఇచ్చి, పనులు చేస్తున్నామని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ చెప్పారు. చిన్నచింతకుంట మండల కేంద్రంలోని మాతాగంగా భవాని, వాల్మీకి కమ్యూనిటీ హాల్‌లకు ఆమె శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ మాట్లాడుతూ రూ.18 లక్షల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్స్‌ నిర్మించనున్నట్లు చెప్పారు. త్వరలోనే వీటి నిర్మాణాలను ప్రారంభించుకుందామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. ఈసారి సీసీ కుంట మండలంలో అన్ని గ్రామాల సర్పంచ్‌లను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానన్నారు. కేంద్రం నుంచి వచ్చే ప్రతీ రూపాయి ప్రజలకు చేరవేసే బాధ్యత తనదన్నారు. ఇప్పుడు లోకల్‌ బాడీ ఎన్నికల్లో గెలిస్తేనే రేపు రాష్ట్రంలో మనం అధికారంలోకి వస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనుల్లో కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు పద్మజారెడ్డి, పార్లమెంట్‌ కన్వీనర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా ప్రశాంత్‌రెడ్డి, ముదిరాజ్‌ సంఘం నాయకులు శ్రీనివాసులు, అసెంబ్లీ కన్వీనర్‌ కురువ రమేష్‌, బీజేపీ నాయకులు నంబి, నరేందర్‌ జి, పార్టీ మండల అధ్యక్షుడు దశరథ్‌, డాక్టర్‌ రాము, బాలస్వామి, పర్దిపూర్‌ నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2025 | 11:00 PM