Share News

ఆర్టీసీ బస్సులో రూ.3.50 లక్షలు చోరీ

ABN , Publish Date - May 13 , 2025 | 11:11 PM

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగులోంచి రూ.3.50 లక్షలు చోరీ అయిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

ఆర్టీసీ బస్సులో రూ.3.50 లక్షలు చోరీ

మహిళ బ్యాగులోంచి అపహరణ

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఘటన

మక్తల్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగులోంచి రూ.3.50 లక్షలు చోరీ అయిన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మక్తల్‌ పట్టణంలోని ఆనంపల్లి వీధికి చెందిన ఉప్పరి మహేశ్వరి మహిళా సంఘం నుంచి అప్పుగా తీసుకున్న రూ.3.50 లక్షలు తన చెల్లికి ఇవ్వాలనుకుంది. అందుకోసం మక్తల్‌ ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చి ఉదయం 10 గంటలకు రాయచూరు బస్సు ఎక్కింది. కొంతదూరం వెళ్లిన తర్వాత బ్యాగులో డబ్బులు కనిపించకపోవడంతో బస్సులో వెతికింది. ఆ తర్వాత మక్తల్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు బస్టాండ్‌లో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. రద్దీ కారణంగా ఆధారాలు లభించలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - May 13 , 2025 | 11:11 PM