Share News

సాగునీటి అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు

ABN , Publish Date - May 26 , 2025 | 11:13 PM

భూనిర్వాసితుల సాగునీటి అభివృద్ధి పనుల కో సం రూ.25కోట్లు, జవహార్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ మిగులు పనుల సర్వే కోసం రూ.16.20 లక్షలు విడుదల అయ్యాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

సాగునీటి అభివృద్ధి పనులకు రూ.25 కోట్లు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

విలేకరుల సమావేశంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సర్వే కోసం రూ. 16.20లక్షల నిధులు మంజూరు

గద్వాల న్యూటౌన్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): భూనిర్వాసితుల సాగునీటి అభివృద్ధి పనుల కో సం రూ.25కోట్లు, జవహార్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ మిగులు పనుల సర్వే కోసం రూ.16.20 లక్షలు విడుదల అయ్యాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం జిల్లా కేం ద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృ ష్ణమోహన్‌రెడ్డి మాట్లాడారు. జూరాల నెట్టెంపా డు ఎత్తిపోతల పథకం పనులను మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభం చేయగా, మిగులు పనులు బీఆర్‌ఎస్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో కొనసాగాయని, భారీ ప్రాజెక్టులైనందున సమయం తీసుకుంటున్నాయన్నారు. వాటి నిర్మాణాలను ఆపితే మన రైతాంగం నష్టపోతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్మాణాలు జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. ఎగువ ప్రాజెక్టులలో డ్యాంలలో నీళ్లు లేక మార్చి, ఏప్రిల్‌లో నీళ్లు అందక పంటలు ఎండిపోయే పరిస్ధితి బాధాకరమన్నారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రికి కలిసి నీటిఎద్దడి రాకుండా తెలంగాణ మంత్రుల ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రానికి వెళ్లి నీళ్లు విడుదల చేయించడం జరిగిందన్నారు. 150 కిలోమీటర్లు దూరంలో ఉండే నారాయణపురం డ్యామ్‌ నుంచి 1టీఎంసీ నీటిని విడుదల చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి సగం టీ ఎంసీ నీళ్లు రావడం బాఽధాకరమన్నారు. భవిష్యత్తులో గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను పూర్తిస్థాయి లో వినియోగించుకోకపోతే గద్వాల నియోజకవర్గంతో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా ఎడారిగా మారే అవకాశం ఉందని, 1.5 టీఎంసీల సామ ర్థ్యం ఉన్న గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 20 టీఎం సీల నీరు నిల్వ చేసే ప్రపోజల్‌ను పంపడానికి నమూనా చిత్రీకరణ చేయడానికి రూ.16.20 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. గద్వాల నియోజకవర్గ పరిధిలోని రైతులు అన్నిరకాల పంటలను సాగుచేయడం గద్వాల ప్రత్యేకతని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు జూన్‌ 2న ప్రారంభించనున్నామన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా గద్వాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుర్వ హనుమంతు, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్‌ జంబు రామన్‌గౌడ, వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ వైస్‌చైర్మన్‌ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ఉరుకుందు, తిక్కన్న, ఖాజా తదితరులు ఉన్నారు.

Updated Date - May 26 , 2025 | 11:13 PM