Share News

అగ్రవర్ణాల పేదలకు రూ.1000 కోట్లు కేటాయించాలి

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:19 PM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.6000 కోట్లతో రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్‌అక్తర్‌ అన్నారు.

అగ్రవర్ణాల పేదలకు రూ.1000 కోట్లు కేటాయించాలి
మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకుడు జహీర్‌అక్తర్‌

మహబూబ్‌నగర్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ.6000 కోట్లతో రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్‌అక్తర్‌ అన్నారు. అదే విధంగా అగ్రవర్ణాలలోని పేదలకు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో అదనంగా రూ.1000 కోట్లు కేటాయించి ఆదుకోవాలని కోరారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల సంక్షేమాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్‌ బీసీ వర్గాలను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం రేవంత్‌ బీసీ గణన చేపట్టడంతో పాటు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, నాయకులు చంద్రకుమార్‌గౌడ్‌, సీజె బెనహర్‌, బెక్కరి మధుసదన్‌రెడ్డి, రాములు యాదవ్‌, అజ్మత్‌అలీ పాల్గొన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 11:19 PM