సంపన్నులతో సమానంగా సన్నబియ్యం
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:04 PM
పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సంపన్నులతో సమానంగా సన్నబియ్యాన్ని అందజేస్తున్నదని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

మల్లాపురం తండాలో లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే
కేటీదొడ్డి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సంపన్నులతో సమానంగా సన్నబియ్యాన్ని అందజేస్తున్నదని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం మండలంలోని మల్లాపురంతండా లో లబ్ధిదారుడు సురేశ్‌నాయక్ కుటుంబ సభ్యు లతో, ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ భోజనం చేశారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం ఎలా ఉందని ఆరా తీశారు. అర్హత గల ప్రతీ పేదవాడికి ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారా న్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేప ట్టిందన్నారు. రేషన్ కార్డుదారులకు ఎలాంటి ఆ ర్థికభారం లేకుండా సన్నబియ్యం అందుతాయ ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మా ట్లాడుతూ సన్నబియ్యం పథకం ద్వారా ఆర్థికం గా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బి య్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని తెలిపారు. పేద ప్రజలు ఆకలితో బాధపడకుం డా పోషకాహారాన్ని పొందాలన్నదే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. అధిక డబ్బులు వెచ్చిం చి బియ్యాన్ని బయట కొనుగోలు చేయాల్సిన అ వసరం లేదన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస రావు, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతు, తహసీల్దార్ హరి కృష్ణ, నాయకులు రాజశేఖర్, రామకృష్ణనాయు డు, ఉరుకుందు, ఆయాగ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.