Share News

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:15 PM

గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు పరిష్కారానికి నవంబరు 1 నుంచి 30వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.

భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు
మాట్లాడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలు పరిష్కారానికి నవంబరు 1 నుంచి 30వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, అటవీశాఖ అధికారి రోహిత్‌ గోపిడీ, జిల్లా ఎమ్మెల్యే లు డాక్టర్‌ వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షే మానికి అధిక ప్రాధాన్యతనిచ్చేందుకే భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. అందు కనుగుణంగా అధికారులు క్షేత్రస్థాయిలో పని చే యకుంటే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పో తుందని, ప్రజలకు నమ్మకం పెంచేలా రెవెన్యూ అధికారులు చొరవ తీసుకోవాలని మంత్రి సూచిం చారు. జిల్లాలో ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి నవంబరు 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తహసీల్దార్లు ప్రతీ రోజు ఉదయం 8 గంట లకే గ్రామాలకు వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం ఎమ్మె ల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ, కశిరెడ్డి నారాయణ రెడ్డిలు మాట్లాడుతూ దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారుల కు సూచించారు. కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మాట్లా డుతూ మంత్రి సూచనల మేరకు జిల్లాలో పెండింగ్‌ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. నవంబ రు 30వ తేదీ నాటికి దరఖాస్తుల శాశ్వత పరిష్కా రానికి తహసీల్దార్లు, ఆర్డీవోలు కృషి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవ సహాయం, ఆర్డీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:15 PM