సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
ABN , Publish Date - Jun 04 , 2025 | 11:07 PM
భూములకు సంబంధించిన సమస్యలను సత్వర పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
భూత్పూర్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి) : భూములకు సంబంధించిన సమస్యలను సత్వర పరిష్కారానికి భూ భారతి రెవెన్యూ సదస్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కర్వెన గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి చట్టాన్ని తీసుకోరావడం జరిగిందన్నారు. రైతులను నమ్మించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో అక్కడి రైతులకు ఎకరాకు రూ.13 లక్షలు చెల్లిస్తే.. అదే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పొయిన రైతులకు ఎకరాకు రూ.3.5 లక్షలు ఇవ్వడం ఎంత వరకు సమజసమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇటీవల అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మాజీ ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లిక్కి నవీన్‌గౌడ్, తహసీల్దార్ కిషన్‌నాయక్, మాజీ సర్పంచ్ హర్యానాయక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, భూపతిరెడ్డి, బాలేమియా పాల్గొన్నారు.