పాలమూరులో మద్యం దుకాణానికి రీ టెండర్
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:38 PM
పాలమూరులోని ఓ మద్యం దు కాణానికి రీ టెండర్ నిర్వహించాలని ఎక్సై జ్ శాఖ నిర్ణయించింది.
మహబూబ్‌నగర్, నవంబరు 14 (ఆంధ్ర జ్యోతి): పాలమూరులోని ఓ మద్యం దు కాణానికి రీ టెండర్ నిర్వహించాలని ఎక్సై జ్ శాఖ నిర్ణయించింది. పాలమూరు నగరం లోని 16వ నెంబర్ మద్యం దుకాణానికి ని ర్వహించిన లక్కీడిప్‌లో ప్రభుత్వ ఉపాధ్యా యురాలికి దుకాణం వరించింది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉంటూ మ ద్యం దుకాణానికి టెండర్ వేయడం సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమని కలెక్టర్, డీఈవోకు ఫిర్యాదు చేయడంతో ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. అప్పటికే ఆమె మొదటి విడత లైసెన్స్ ఫీజు రూ.11 లక్షలు చెల్లించారు. మద్యం దుకాణం వచ్చినా ఉద్యోగానికి ఇబ్బందికరంగా మారడంతో ఎ ట్టకేలకు మూడ్రోజుల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసిన ఆమె తన పేరిట వచ్చిన మద్యం దుకాణాన్ని ఉపసం హరించుకుంటున్నానని తన లైసెన్స్ రద్దు చేయాలని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. దీన్ని ఆమోదిస్తూ శుక్రవారం సదరు టెండ రు రద్దుచేసి రీ టెండర్ నిర్వహించాలని క మిషనర్ ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు తదుపరి లక్కీడిప్ తేదీ కోసం కలెక్టర్‌ను అనుమతి కోరారు. కలెక్టర్ తేదీ నిర్ణయిస్తే తొందరలోనే 16వ నెంబర్ దుకాణానికి రీ టెండర్ నిర్వహించనున్నారు. టెండర్ల ప్రక్రియలో మొత్తం 28 మంది టెండర్లు దాఖలు చేశారు. వారికే ఇప్పుడు లక్కీడిప్ ద్వారా రీ టెండర్ నిర్వహించి దుకాణ ం కేటాయించనుండటంతో మళ్లీ వారిలో ఆశలు చిగురించాయి.