వర్గీకరణ అనంతరమే ఫలితాలు విడుదల చేయాలి
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:06 PM
ఎస్సీ వర్గీకరణ అనంతరమే గ్రూప్ 1, 2, 3 ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జడ్చర్లలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

జడ్చర్ల, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ వర్గీకరణ అనంతరమే గ్రూప్ 1, 2, 3 ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జడ్చర్లలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి జంగయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలుపుకోకుండా, మాల నాయకులు ఒత్తిడి మేరకే ఫలితాలను విడుదల చేశారని ఆరోపించారు. విడుదల చేసిన ఫలితాలను ఎస్సీ వర్గీకరణకు అనుసంధానం చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ నాయకులు కొంగళి నాగరాజు, ఖార్ఖాన వెంకటయ్య, దగ్గుల బాలరాజ్, కరాటే శ్రీను, బృందం గోపాల్, సత్యం, భీంరాజ్, నర్సిములు, కుర్మయ్య, గోపాల్, యాదయ్య పాల్గొన్నారు.
పాలమూరు : ఎస్సీ వర్గీకరణ తరువాతే ప్రభుత్వ, ఉద్యోగ ఫలితాలు, నియామకాలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు శ్రీరాములు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్‌లో ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాలు చేపట్టిన నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. ఎంఈఎఫ్ జాతీయ నాయకులు పోలే బాలయ్య, జె.బాలరాజు, కె.కొండయ్య, మల్లేష్, అంజి పాల్గొన్నారు.