Share News

సీడ్‌ పత్తి కొనుగోలుపై ఆంక్షలు సరికాదు

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:15 PM

విత్తన పత్తిని ఎకరాకు రెండు క్వింటాళ్లు మాత్ర మే కొనుగోలు చేస్తామని ఆంక్షలు విధించడం సరికాదని జోగుళాంబ గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జి ల్లా చైర్మన్‌ రంజిత్‌ కుమార్‌ అన్నారు.

సీడ్‌ పత్తి కొనుగోలుపై ఆంక్షలు సరికాదు

  • ఎన్‌హెచ్‌పీఎస్‌ జిల్లా చైర్మన్‌ రంజిత్‌ కుమార్‌

గద్వాల టౌన్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విత్తన పత్తిని ఎకరాకు రెండు క్వింటాళ్లు మాత్ర మే కొనుగోలు చేస్తామని ఆంక్షలు విధించడం సరికాదని జోగుళాంబ గద్వాల జిల్లా నడిగడ్డ హక్కుల పోరాట సమితి జి ల్లా చైర్మన్‌ రంజిత్‌ కుమార్‌ అన్నారు. ఆర్గనైజర్లు ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాల ని డిమాండ్‌ చేశారు. బుధవారం గద్వాల పట్టణంలోని సమితి కార్యాలయంలో విత్తన పత్తి సాగు రైతు లతో అత్యసర సమావేశం నిర్వహించిన అనం తరం రంజిత్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడా రు. ఆర్గనైజర్ల మోసపూరిత ఆంక్షలకు వ్యతిరేకంగా రైతులు అయిజ మండలంలో ఆందోళన చేస్తున్న సందర్భంగా అక్కడి వచ్చిన అధికారులు కలెక్టర్‌తో మాట్లాడి రైతులు, ఆర్గనై జర్లతో కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటుకు నిర్ణ యించడం స్వాగతార్హమన్నారు. సాగు చేసిన రెండు నెలలకు క్రాసింగ్‌ జరిగే సమయంలో ఆంక్షలు విధిస్తున్న తీరు రైతులను మోసగించ డమేనన్నారు. రైతుపక్షపాతినని చెప్పుకునే ప్ర భుత్వం ఇక్కడి సీడ్‌ పత్తి రైతుల సమస్యలపై తక్షణ దృష్టి సారించాలన్నారు. లేని పక్షంలో నా ణ్యమైన విత్తనోత్పత్తికి మారుపేరుగా, విత్తన హబ్‌గా పేరు గడించిన నడిగడ్డలో రైతులకు తీరని అన్యాయం జరగనుందన్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి నడిగడ్డలోని సీడ్‌ పత్తి రైతులందరూ హాజరై సమస్యను వివరించాలన్నారు. సమావేశంలో పోరాట సమి తి కన్వీనర్‌ బుచ్చిబాబు, కార్యదర్శి లవన్న, నాయకులు విష్ణు, గోపాల్‌, నేతన్న, కిష్టన్న, బీచుపల్లి, తిమ్మప్ప, కృష్ణ ఉన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:15 PM