నీటి సరఫరా పునరుద్దరణ
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:20 PM
పాలమూరు నగరానికి తాగునీరు సరఫరా అయ్యే మిషన్‌భగీరథ పైపులు ధర్మాపూర్ రామిరెడ్డిగూడ వద్ద రెండు రోజుల క్రితం ధ్వంసమయ్యాయి.
మహబూబ్‌నగర్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు నగరానికి తాగునీరు సరఫరా అయ్యే మిషన్‌భగీరథ పైపులు ధర్మాపూర్ రామిరెడ్డిగూడ వద్ద రెండు రోజుల క్రితం ధ్వంసమయ్యాయి. దీంతో నగరానికి నీటి సరఫరా నిలిచిపోయింది. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టగా, సోమవారం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మునిసిపల్ అధికారులు పనులు పర్యవేక్షించారు. సాయంత్రానికి నీటి సరఫరాను పునరుద్దరించారు. కమిషనర్ మాట్లాడుతూ పైపుల లీకేజీ కారణంగా రెండు రోజులుగా నగరానికి నీటి సరఫరా నిలిచిపోయిందని, పనులు పూర్తి కావడంతో సాయంత్రం నుంచే నీటి సరఫరా ప్రారంభమవుతుందన్నారు.
సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబర్..
నగరంలో తాగునీటి పైప్‌లైన్‌ల లీకేజీ, నీటి సరఫరాలో అంతరాయం, పబ్లిక్‌బోర్ రిపేరు, వీధి దీపాలు వెలగకపోవడం వంటి సమస్యలపై టోల్‌ఫ్రీ నెంబర్ 7093911352కు ఫోన్ చేయాలని కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదులు చేసుకోవచ్చని సూచించారు.