Share News

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ABN , Publish Date - Jul 09 , 2025 | 11:27 PM

పోలీస్‌ సి బ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ స్వీకరించిన ఫిర్యాదులపై జాప్యం చే యకుండా తక్షణమే స్పందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీని వాసరావు అన్నారు.

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

- మల్దకల్‌ పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

మల్దకల్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పోలీస్‌ సి బ్బంది ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ స్వీకరించిన ఫిర్యాదులపై జాప్యం చే యకుండా తక్షణమే స్పందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీని వాసరావు అన్నారు. బుధవారం మల్దకల్‌ పోలీ స్‌స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా ఎస్పీ స్టేషన్‌ రికార్డ్స్‌ను, పరిసరా లను, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్‌ రిసెప్షన్‌, స్టేషన్‌ రై టర్‌, టెక్‌టీమ్‌, ఎస్‌హెచ్‌వో, మెన్‌ రెస్ట్‌ రూం, లాకప్‌ రూంను పరిశీలించిన ఎస్పీ స్టేషన్‌లో రో జువారీగా నిర్వహిస్తున్న జనరల్‌ డైరీ, బీట్‌ డ్యూటీ బుక్స్‌, సుపీరియర్‌ ఆఫీసర్స్‌ విజిటింగ్‌ బుక్స్‌లను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌ పరిస రాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. స్టాఫ్‌కు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించా రు. పోలీస్‌స్టేషన్‌లో ఎంతమంది సిబ్బంది ఉ న్నారు. వారు ఏయే విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ నుంచి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్‌, పెట్రో కార్స్‌ విధులు నిర్వహిస్తున్నా యని, స్టేషన్‌ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బీట్స్‌ నడుస్తున్నాయని తెలుసుకుని సక్రమంగా పె ట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. అలాగే దొంగత నాలు జరగకుండా నిఘా పెంచాలని ఆదేశించా రు. విస్తృతంగా డ్రెంకెన్‌ డ్రైవ్‌లు తనిఖీలు చేప ట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలన్నారు. డయల్‌ 100కు కాల్‌ రాగానే వెంటనే సంఘట నా స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించా లని సూచించారు. అలాగే బ్లూకోల్డ్స్‌, పెట్రోల్‌ కార్‌ సిబ్బంది నిరంతం గస్తీ నిర్వహించాలని చెప్పారు. త రచూ గ్రామాలను సందర్శించి సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలు, మాదకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎస్‌ఐ నందీకర్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:27 PM