Share News

వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత : కలెక్టర్‌

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:05 PM

సమాజంలో వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత అని కలెక్టర్‌ విజ యేందిర బోయి అన్నారు.

వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత : కలెక్టర్‌
జెండా ఊపి ర్యాలీని ప్రారరంభిస్తున్న కలెక్టర్‌ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : సమాజంలో వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత అని కలెక్టర్‌ విజ యేందిర బోయి అన్నారు. అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవాలను పురస్కరించుకొని శనివారం స్టేడియం మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేడియం నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. వృద్ధుల పట్ల దయతో వ్యవహరించాలని, గౌరవంగా ఉండాలని, వారి అవసరాలను, మానసిక స్థితిని అర్థం చేసుకొని మసులుకోవాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఇందిర, జిల్లా సంక్షేమాధికారి జరీనాబేగం, అదనపు ఎస్పీ రత్నం, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్‌, డీఎంహెచ్‌వో కృష్ణ, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు, రాజసింహుడు, కోటిరెడ్డి, నాగేంద్ర స్వామి, సత్యనారాయణ పాల్గొన్నారు.

ప్రమాదాల నివారణకు చర్యలు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ : జిల్లాలో ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ విజయేందిబోయి అన్నారు. శనివారం క లెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో ఎస్పీ జానకితో కలిసి పోలీస్‌, రవాణా, జాతీయ రహ దారులు, ఆర్‌అండ్‌బీ అధికారులతో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. రాష్ట్ర రహదారులు, నేషనల్‌ హైవే 167, 44పై ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించి శాఖలు చర్యలు తీసుకోవాన్నారు. అంతకుముందు ఈనెల 20న అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్‌ సహకారంతో ప్రయోగాత్మకంగా లిసెన్‌ టు చిల్డ్రన్‌ అనే కార్యక్రమంపై అవగాహన కల్పిం చారు. అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, అడిష నల్‌ ఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పంచా యతీ రాజ్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, శిశు సంక్షేమా ధికారి జరీనా, డీఈవో ప్రవీణ్‌కుమార్‌, పంచా యతీరాజ్‌ అధికారి నిఖిల, మునిసిపల్‌ కమిష నర్‌ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:05 PM