Share News

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి

ABN , Publish Date - Jun 15 , 2025 | 11:17 PM

దేశంలో నానాటికి పెరిగిపోతున్న ప్రైవేటు రం గంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి రిజ ర్వేషన్లు విధిగా అమలుచేయాలని వక్తలు కో రారు.

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి

- రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు

- కార్పొరేట్‌ ఎగవేతలపై విచారణ జరపాలి

గద్వాల టౌన్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : దేశంలో నానాటికి పెరిగిపోతున్న ప్రైవేటు రం గంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి రిజ ర్వేషన్లు విధిగా అమలుచేయాలని వక్తలు కో రారు. ‘ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు - అని వార్యత’ అనే అంశంపై ఆదివారం పట్టణంలోని బీసీ టీచర్స్‌ యూనియన్‌ కార్యాలయంలో రౌం డ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్బంగా మాట్లాడిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి నాగర్‌దొడ్డి వెంకట్రాములు, ప్రైవేటు పెట్టుబ డులను ప్రభుత్వానిధినేతలు బాహాటంగా ఆ హ్వానిస్తూ, ప్రభుత్వపరంగా వారికి అనేక రూ పాల్లో రాయితీలు కల్పిస్తున్న నేపథ్యంలో రిజర్వే షన్ల అమలుపై చట్టం రూపొందించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లా డుతూ కార్పొరేట్‌ కంపెనీల మనుగడ పూర్తిగా బ్యాంకుల రుణాలపై ఆధారపడి ఉండగా ప్రభు త్వపరంగా వారు పొందే రాయితీలన్నీ ప్రజాధ నం నుంచి వచ్చినవేనన్న విషయాన్ని పాలకు లు మరచిపోరాదన్నారు. పాలమూరు అధ్యయ న వేదిక కన్వీనర్‌ ఇక్బాల్‌పాషా మాట్లాడుతూ ఆర్థిక వెనుకబాటుతనం పేరుతో అగ్రవర్ణాలకు కల్పించిన రిజర్వేషన్ల చట్టం రద్దు చేయాలన్నా రు. వందలు, వేల కోట్ల పెట్టుబడితో నడుస్తు న్న లిమిటెడ్‌, ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలు బీ ఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో, షేర్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అయిన కంపెనీలు తప్పనిసరిగా రిజర్వేష న్‌ అమలు చేసేలా ప్రభుత్వంపై బహుజన వ ర్గా లన్నీ ఒత్తిడి తేవాలన్నారు. సమావేశంలో మా ట్లాడిన వక్తలు, బ్యాంకుల నుంచి రుణాలు పొంది తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారి పోయిన వ్యక్తులపై మరింత కఠినంగా చర్యలు ఉండాలన్నారు. బహుజన రాజ్యసమితి అధ్యక్షు డు వాల్మీకి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌, సీపీఎం, సీఐ టీయూ, తెలంగాణ రైతాంగ సమితి తదితర సంఘాల నాయకులు కురువ పల్లయ్య, గోపాల్‌ యాదవ్‌, నరసింహ, సిద్ధార్థకృష్ణ, దామోదర్‌, నాగన్న, వెంకటన్న, ప్రవీణ్‌కుమార్‌, రాజు, శ్రీని వాసులు, వెంకటేష్‌గౌడ్‌ ఉన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 11:17 PM