Share News

ఈవ్‌టీజింగ్‌, వేధింపులపై ఫిర్యాదు చేయండి

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:02 PM

ఈవ్‌టీజింగ్‌, సోషల్‌ మీడియాలో వేధింపులకు గురవుతున్న వారితో పాటు ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేస్తే గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

ఈవ్‌టీజింగ్‌, వేధింపులపై ఫిర్యాదు చేయండి
బాలికలను ఉద్దేశించి మాట్లాడుతున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు

- మహబూబ్‌నగర్‌ డీఎస్పీ వెంకటేశ్వర్లు

జడ్చర్ల, మార్చి 11 (ఆంధ్రజ్యోతి) : ఈవ్‌టీజింగ్‌, సోషల్‌ మీడియాలో వేధింపులకు గురవుతున్న వారితో పాటు ర్యాగింగ్‌పై ఫిర్యాదు చేస్తే గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. జడ్చర్ల మునిసిపాలిటీ బాదేపల్లి బాలుర జడ్పీహెచ్‌ఎస్‌లో మంగళవారం షీ టీం, గర్ల్‌ చైల్డ్‌ ఎంపవర్మెంట్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొని, మాట్లాడారు. షీ టీం ఎలా పనిచేస్తుందనే అంశాన్ని వివరించారు. ఈవ్‌టీజింగ్‌, సోషల్‌మీడియా వేధింపులు, మహిళల అక్రమరవాణా, బాలల దుర్వినియోగం, బాల్య వివాహలు, బాలకార్మికులు చైల్డ్‌లైన్‌ 1098, బాండెడ్‌ లేబర్‌, ఫోక్సో చట్టం, పని వేధింపులు, గుడ్‌ టచ్‌ - బ్యాడ్‌ టచ్‌, యాంటీ ర్యాగింగ్‌, సెల్ఫ్‌ డిఫెన్స్‌, సైబర్‌ క్రైమ్‌ తదితర అంశాలపై వివరించారు. ఎలాంటి సమస్య ఎదురైన డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని, షీ టీంకు ఫిర్యాదు చేసేందుకు 8712659365తో ఫిర్యాదు చేయాలన్నారు. మహిళలు, పిల్లలు, కుటుంబ హింసకు గురవుతున్న వారి కోసం ఇటీవల జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రంను ప్రారంభించడం జరిగిందని, న్యాయం పొందడానికి ఎంతో సహయపడుతుందని వివరించారు. జడ్చర్ల సీఐ కమలాకర్‌, ఉమెన్‌ ఎస్‌ఐ వనజ, షీ టీం, గర్ల్‌ చైల్డ్‌ ఎంపవర్మెంట్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 11:02 PM