Share News

మత రాజకీయాలు దేశానికి విఘాతం

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:14 PM

నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేప ట్టాక దేశంలో మత రాజకీయాలు విధ్వం సాలు సృష్టిస్తూ కుల, మతాల మధ్య వి ఘాతాలు కలిగిస్తున్నారని పాండిచ్చేరి మా జీ ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొ న్నారు.

మత రాజకీయాలు దేశానికి విఘాతం
మాట్లాడుతున్న పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి

- పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి

ఆత్మకూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేప ట్టాక దేశంలో మత రాజకీయాలు విధ్వం సాలు సృష్టిస్తూ కుల, మతాల మధ్య వి ఘాతాలు కలిగిస్తున్నారని పాండిచ్చేరి మా జీ ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొ న్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడి ఎం పిక సందర్భంగా పట్టణంలోని ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావే శానికి హాజరై ప్రసంగించారు. దేశానికి స్వా తంత్య్రం తేవడంలో కాంగ్రెస్‌ పార్టీ కీలకపాత్ర పోషించి వందలాది మంది నాయకులను కో ల్పోయిందని గుర్తు చేశారు. స్వాతంత్య్రం తె చ్చింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ అంటూ కితాబిచ్చారు.

రూపు రేఖలు మారుస్తా : మంత్రి వాకిటి శ్రీహరి

ఆత్మకూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడంతో పాటు ఆత్మకూరు, అమరచింత రూపురేఖలు మార్చే దిశగా ప్రజా అభివృద్ధికి కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. ఆత్మకూ రులో రూ.25 కోట్లతో 50 పడకల ఆసుపత్రి, రూ.122 కోట్లతో ఆత్మకూరు నుంచి కృష్ణానది మీదుగా జోగులాంబ గద్వాల జిల్లా వరకు వం తెనకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసా ద్‌, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజుగౌడ్‌, ధనలక్ష్మి, తిరుపతయ్య, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ రహమతుల్లా, పరమేష్‌, నల్గొండ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:14 PM