మహనీయుల జాతర కరపత్రాల విడుదల
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:44 PM
పట్టణ చౌరస్తాలో బీఎస్పీ నాయకులు ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించను న్న మహనీయుల జాతర కరపత్రాలను ఆదివా రం విడుదల చేశారు.
కొత్తకోట, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి) : పట్టణ చౌరస్తాలో బీఎస్పీ నాయకులు ఈ నెల 26న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించను న్న మహనీయుల జాతర కరపత్రాలను ఆదివా రం విడుదల చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ దేవరకద్ర నియోజకవర్గం ఇన్‌చార్జి మాసన్న మాట్లాడారు. బహుజనులకు రాజ్యాధికారం వ స్తేనే ప్రభుత్వ ఫలాలు సమానంగా అందుతా యన్నారు. అందుకోసం బహుజనులు రాజకీ యంగా ఐక్యం చేయడం కోసం నాగరకర్నూల్ పట్టణంలో జాతర జరుగుతుందన్నారు. మహ నీయులు ముందు చూపుతో చెప్పి సత్యాలను తెలుసుకొని చట్టసభలకు జరుగు ఎన్నికల్లో సీ ట్లు మనవే అధికారం మనదే నినాదంతో పని చేద్దామని పిలుపునిచ్చారు. వినోద్ కుమార్, యాదయ్య, శ్రీను, కురుమన్న ఉన్నారు.