నాణ్యత పేరుతో తిరస్కరిస్తున్నారు
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:30 PM
నాణ్యతలేదనే కారణంతో పత్తిని తిరస్కరిస్తున్నారని పత్తిరైతులు మరోసారి రోడ్డెక్కారు.
- ఉండవల్లి వద్ద జాతీయ రహదారిపై పత్తి రైతుల రాస్తారోకో
- రెండుగంటల పాటు నిలిచిన వాహనాలు
- పోలీసుల హామీతో శాంతించిన రైతులు
అలంపూరు చౌరస్తా, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) :నాణ్యతలేదనే కారణంతో పత్తిని తిరస్కరిస్తున్నారని పత్తిరైతులు మరోసారి రోడ్డెక్కారు. గురువారం సా యంత్రం జోగుళాంబగద్వాల జిల్లా ఉండ వల్లి వద్ద 44వ జాతీయరహదారిపై రాస్తా రోకో చేశారు. అధిక వర్షాల కారణంగా దిగుబడి తగ్గి పోయాయని, వచ్చిన పత్తి ని తిరస్కరిస్తే.. తెచ్చిన అప్పులు ఎలా కట్టాలని రైతులు మండిపడ్డారు. సీసీఐ అధికారులు అంక్షలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రెండుగంటల పాటు రాస్తారోకో చేయడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. ఇటిక్యాల ఎస్సై రవి అక్కడికి చేరుకుని మీ సమస్య ను ఉన్నతాధికారుల కు తెలుపుతామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించా రు. ఆనంతంరం సీఐ రవిబాబు, కోదండా పురం ఎస్సై మురళి, ఉండవల్లి ఎస్సై శేఖర్‌లు మిల్లు వద్దకు చేరుకుని రైతులకు సమస్యలకు రాకుండా చూసుకోవాలని మార్కెట్ యార్డు సెక్రటరీ ఎల్లస్వామికి సూచించారు. రైతులు ప్రతీ సారి జాతీ యరహదారిపై రాస్తారోకో చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.