Share News

నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:52 PM

సామాజిక బాధ్యతతో తాగునీరు అందించే సంస్ధ స్మాట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులపై కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

 నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌

- ఫిర్యాదు చేసి 70 రోజులైనా పట్టించుకోని పోలీసులు

- విలేకర్ల సమావేశంలో స్మార్ట్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ కరుణాకర్‌రెడ్డి

గద్వాల క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సామాజిక బాధ్యతతో తాగునీరు అందించే సంస్ధ స్మాట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆస్తులపై కొందరు వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో మానక హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన ట్లు స్మార్ట్‌ ఇండియా చైర్మన్‌, ఎండీ కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జోగుళాంబ గ ద్వాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు తప్పుడు డాక్యుమెంట్లతో స్మార్ట్‌ ఇండియా ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకొందని గత 70 రోజుల క్రితం పోలీసుల కు ఫిర్యాదు చేశారన్నారు. అయితే పోలీసులు ఈ సంఘటనపై ఎ లాంటి చర్యలు తీసుకోకపోవడంతో మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించామన్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎస్పీకి నోటీసులు కూడా వచ్చాయన్నారు. ఈ నెల 21లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఎస్పీని మానవ హక్కుల కమిషన్‌ ఆదేశించడం జరిగిందన్నారు.అంతేకాకుండా కోర్టును కూడా ఆశ్రయిం చగా గద్వాల సివిల్‌ కోర్డు 2025, సెప్టెంబ రు 4న తాత్కాలిక నిషేధాజ్ఞ కూడా ఇచ్చిం దన్నారు. అయితే పోలీసులు కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోగా పిర్యాదుదారుడిపైనే తప్పుడు కౌంటర్‌ కేసును నమోదు చే యడం విడ్డూరమన్నారు. మేము గత 15 సంవత్సరాలుగా గ్రామాలకు తాగునీరు అం దిండటంతో పాటు ఉపాధి, సాంకేతికత అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అలాంటి మా సంస్ధకు చెందిన ఆ స్తులను కొందరు నకిలీ డాక్యుమెంట్లతో కా జేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని ఆయన కోరారు.

Updated Date - Nov 09 , 2025 | 10:52 PM