Share News

ప్రయోజనాలకు అనుగుణంగా కుంటల పునర్నిర్మాణం

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:34 AM

రైతుల ప్రయోజనాలకు అను గుణంగా కుంటల పునర్నిర్మాణం చేపట్టామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

ప్రయోజనాలకు అనుగుణంగా కుంటల పునర్నిర్మాణం

వనపర్తి రూరల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : రైతుల ప్రయోజనాలకు అను గుణంగా కుంటల పునర్నిర్మాణం చేపట్టామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివా రం వనపర్తి మండల పరిధిలోని క్రాస్‌ రోడ్డు ప క్కన వాటర్‌ షెడ్‌ అంతర్భాగంలో నిర్మించిన కుంటను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి నాయకులు, రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఈ కుంటను ఆధునికీక రించడం ద్వారా 50 ఎకరాలకు సాగు నీరు అం దుతుందని, ఈ కుంట చిన్నదిగా ఉండడంతో చాలీచాలని సాగు నీరు అందుతుందన్నారు. కుంట ఎత్తు నాలుగు ఫీట్లు పెంచి భీమా కాలు వ ద్వారా పైపు లైన్‌ వేసి పునరుద్ధరించాలని రై తులు నిరంజన్‌రెడ్డిని కోరారు. ఈ ప్రాంతాన్ని సుశితంగా పరిశీలించిన నిరంజన్‌ రెడ్డి రైతుల సంక్షేమమే లక్ష్యమని, నిపుణుల సలహాతో సాఽ ద్య అసాధ్యాలను చర్చించి భీమా కాలువ నుం చి పైప్‌ లైన్‌ వేయించి కుంటను పునరుద్ధరి స్తామని హామీ ఇచ్చారు. అనంతరం టీ స్టాల్‌ వద్ద నాయకులు, కార్యకర్తలతో కలసి టీ తాగి ప్రజా సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, మాధవ్‌రెడ్డి, నరసింహ, ఽధర్మా నాయక్‌, మహేశ్వర్‌ రెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, చిట్యాల, రాము కృష్ణా నాయక్‌, రూప్లనాయక్‌, భీముడు, గోవిందు, పాండు, శంకర్‌, హనుమం తు నారియా, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 12:34 AM