Share News

పనిచేసిన వారికి గుర్తింపు

ABN , Publish Date - Jun 25 , 2025 | 11:36 PM

‘‘కాం గ్రెస్‌లో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుంది.. గద్వాలలో పార్టీ పటిష్టతకు పనిచేసిన సరితమ్మకు కూడా గుర్తింపు ఉంది.. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో గద్వాల కాంగ్రెస్‌పై సమాలోచనలు జరిగాయి... రెండు రోజుల్లో మంచి పెద్ద పదవి వస్తుందని’’ ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి విశ్వనాథ్‌ ప్రకటించారు.

  పనిచేసిన వారికి గుర్తింపు
కాంగ్రెస్‌ విసృతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి విశ్వనాథ్‌

- రెండు రోజుల్లో సరితకు పెద్ద పదవి

- విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జి విశ్వనాథ్‌

గద్వాల, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) ‘‘కాం గ్రెస్‌లో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుంది.. గద్వాలలో పార్టీ పటిష్టతకు పనిచేసిన సరితమ్మకు కూడా గుర్తింపు ఉంది.. సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో గద్వాల కాంగ్రెస్‌పై సమాలోచనలు జరిగాయి... రెండు రోజుల్లో మంచి పెద్ద పదవి వస్తుందని’’ ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి విశ్వనాథ్‌ ప్రకటించారు. బుధవారం హరిత హోటల్‌లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా విశ్వనాథ్‌ మాట్లాడుతూ... గద్వాలతో పాటు మరో పది జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు ఉన్నా యి. వీటిపై మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో చర్చించామని చెప్పారు.

వారికి పదువులు..మాపై కేసులు: సరిత

గద్వాలలో కాంగ్రెస్‌ పార్టీ కోసం పనిచేశాను.. 75వేల ఓట్లకు పైగా సాధించాను కానీ పదవులు మా త్రం వారికే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు నాయకులు, కార్యకర్తలు కూడా ఇవే విషయాలు చెప్పడంతో ఏఐసీసీ ఇ న్‌చార్జి విశ్వనాథ్‌కు ఆమె హిందీలో వివరించా రు. వారికి మార్కెట్‌ చైర్మన్‌, జములమ్మ ఆలయ చైర్మన్‌ పదవులు ఇచ్చినా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ కండువా వేసుకోలేదని వివరించారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌, క్రిష్టియన్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దీపక్‌ జాన్‌,, అబ్జర్వర్‌ వెంకటేష్‌, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రెడ్డి, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌ బీయస్‌ కేశవ్‌, శంకర్‌, ఇసాక్‌ తదితరులు పాల్గొన్నారు.

గద్వాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం

గద్వాల న్యూటౌన్‌, (ఆంధ్రజ్యోతి): గద్వాల ని యోజక వర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా మని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి విశ్వనాఽథ్‌ అ న్నారు. గద్వాల నియోజకవర్గం ముఖ్యనాయకు లు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం బుధ వారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి క్యాంపు కార్యాయలంలో నిర్వహించారు. సమావేశంలో సంపత్‌కుమార్‌, దీపక్‌జాన్‌, రాజివ్‌రెడ్డి, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 25 , 2025 | 11:37 PM