నేతన్నకు భరోసా
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:19 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న భరోసా పథకం కింద నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 1,860 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు చేశారు.
చేనేత, అనుబంధ కార్మికులకు అందనున్న ప్రోత్సాహకం
నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 1,860 మంది కార్మికులకు లబ్ధి
నారాయణపేట, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేతన్న భరోసా పథకం కింద నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 1,860 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఈ నెల 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు చేశారు. నారాయణపేట జిల్లాలో 622 మగ్గాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 188 మగ్గాలు, తాత్కలిక మగ్గాలు 120 మొత్తం 930 జియో ట్యాగింగ్ చేసినవి ఉన్నాయి. పథకం కింద జియో ట్యాగింగ్ చేసిన మగ్గాలపై పని చేస్తున్న కార్మికులకు ఏడాదికి గరిష్ఠగా రూ.18,000, అనుబంధ కార్మికులకు వేతన ప్రోత్సాహకం కింద రూ.6,000 అందించనున్నారు. ఏడాదిలో రెండు సార్లు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తారు. 18 ఏళ్లు నిండి, జియో ట్యాగింగ్ చేసిన మగ్గాలపై పని చేస్తూ వార్షిక ఆదాయంలో కనీసం 50 శాతం వృత్తిద్వారా పొందుతున్న వారు అర్హులు. ప్రోత్సాహకం అందనుండటంతో ముడి సరుకులు, యార్న్ కొనుగోలుకు ఆర్థికంగా కలిసి వస్తుందని కార్మికులు చెబుతున్నారు.