రాపిడో, ఊబర్ యాప్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:18 PM
రాపిడో, ఊబర్, ఓలా యాప్‌లను రద్దు చేయాలని ఆటో జేఏసీ, ఐన్‌టీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములుయాదవ్, రాంమోహన్ డిమాండ్ చేశారు.
పాలమూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : రాపిడో, ఊబర్, ఓలా యాప్‌లను రద్దు చేయాలని ఆటో జేఏసీ, ఐన్‌టీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాములుయాదవ్, రాంమోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిరుద్యోగ, యువత జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రోజుకు రెండు వేల ఆటోలు నడుస్తున్నాయని, తక్షణమే యాపులను రద్దు చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాన్స్‌పోర్టు రంగంపై కనీసమైన కనికరం లేదన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు నేటికీ చెల్లించలేదన్నారు. తక్షణమే యాప్‌లను రద్దు చేసి, ట్రాన్స్‌ఫోర్టు రంగంపైన ఆధారపడిన ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలన్నారు. బీఆర్‌ఎస్‌కేవీ జిల్లా నాయకుల రాజు, నగేష్ పాల్గొన్నారు.