Share News

వైభవంగా రంగనాయకుడిరథోత్సవం

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:27 PM

వనప ర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకుడి రథోత్సవం గురువారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా నిర్వ హించారు.

 వైభవంగా రంగనాయకుడిరథోత్సవం
శ్రీరంగాపురంలో రథోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

- ముఖ్య అతిథులుగా హాజరైనా ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఆలయ ధర్మకర్త కృష్ణదేవరావు

- అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు..

- గోవింద నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం

పెబ్బేరు రూరల్‌, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): వనప ర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకుడి రథోత్సవం గురువారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా నిర్వ హించారు. ఆలయ ధర్మకర్త కృష్ణదేవ రావు, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్యతిథులుగా హాజరై ప్రధాన ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకస్వామి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి పల్లకీలో తీసుకువచ్చి రథంపై ఉం చారు. అనంతరం రథాన్ని ఆలయ ధర్మకర్త కృష్ణదేవ రావు, ఎమ్మెల్యే మేఘారెడ్డి ముందుకు కదిలించారు. భక్తులు రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగా యి. రథోత్సవాన్ని తిలకించేందుకు వివిధ జిల్లాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చారు. రథాన్నిలాగే సమయంలో ఒకవైపు గొలుసు తెగిపోవడంతో అదుపు తప్పింది. విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ట్రాక్టర్‌ సహా యంతో దారిలోకి తీసుకువచ్చారు. సీఐ రాంబాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ జాతర 15 రోజులుగా కొనసాగుతోందని ఆలయ కమిటీ సభ్యు లు తెలిపారు. జాతరకు వచ్చే భక్తులకు నిర్వాహకు లు, గ్రామస్థులు అన్నదానం, తాగునీరు, వైద్య సదుపా యం కల్పించారు. జాతరలో నిర్వహించిన సాంస్కృతి క కార్యక్రమాలు భక్తులను అలరించాయి. మాజీ సర్పంచ్‌ వాణి, మార్కెట్‌కమిటీ చైర్మన్లు శ్రీనివాస్‌గౌడు, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌, శ్రీలతారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, శ్రీహరిరాజు ఉన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 11:27 PM