Share News

ఉగ్ర దాడికి నిరసనగా ర్యాలీ

ABN , Publish Date - Apr 23 , 2025 | 11:21 PM

కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ మృతులకు సంతాపం తెలుపుతూ బుధవారం కోస్గి పట్టణంలో హిందూవాహిని నాయ కులు ర్యాలీ నిర్వహించా రు.

ఉగ్ర దాడికి నిరసనగా ర్యాలీ
కోస్గిలో ర్యాలీ నిర్వహిస్తున్న హిందూవాహిని నాయకులు

కోస్గి రూరల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ మృతులకు సంతాపం తెలుపుతూ బుధవారం కోస్గి పట్టణంలో హిందూవాహిని నాయ కులు ర్యాలీ నిర్వహించా రు. స్థానిక రామాలయం చౌరస్తా నుంచి వివేకా నంద చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించారు. అనంతరం హిందూవాహినీ కార్యకర్తలు మాట్లాడు తూ కశ్మీర్‌లో హిందూ పర్యాటకులపై ఉగ్రవా దులు చేసిన దాడి పిరికిపంద చర్య అని దేశం లో మత చిచ్చు పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. దాడిలో చనిపోయిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని వారు కొవ్వొత్తులు వెలిగించారు. భజరంగ్‌దళ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2025 | 11:21 PM