ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వర్షం
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:06 PM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం వర్షం కురిసింది.
- మరికల్ మండలంలో 56.0 మి.మీ. నమోదు
- నాగర్‌క ర్నూలులో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు
నాగర్‌కర్నూల్ టౌన్/నారాయణపేట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పలుచోట్ల మంగళవారం వర్షం కురిసింది. నారాయణపేట జిల్లాలో భారీ వర్షపాతం నమోదవగా, మహ బూబ్‌నగర్ జిల్లాలో కూడా వర్షం కురిసింది. నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో మధ్యా హ్నం నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండు గంటల పాటు వాన దంచికొట్టింది. దీంతో పట్టణంలోని పలు కాలనీల్లో రోడ్లన్నీ జలమయమై వాగులను తలపించాయి. కొన్ని వీధుల్లో రోడ్లపై పొంగిపొర్లిన వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పట్టణంలోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్, అంబేడ్కర్ చౌరస్తా, ఉయ్యలవాడ ప్రాంతాల్లో ప్రధాన రహదారిని వరద నీరు ముంచెత్తింది. దీంతో రాకపోకలకు దాదాపు గంట పాటు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా మళ్లించారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 56.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. ధన్వాడ మండలంలో 40.8, దామరగిద్దలో 38.0, నారాయణపేటలో 37.8, మక్తల్‌లో 30.5, ఊట్కూర్‌లో 25.8, నర్వలో 19.0, మాగనూర్ మండలం లో 14.8, కొత్తపల్లి మండలంలో 12.3 మి. మీ. వర్షపాతం నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండలంలో 44.3 మిల్లీమీ టర్ల వర్షం కురువగా తాడూరులో 39.5 మిల్లీ మీటర్లు, తిమ్మాజిపేటలో 38.3, ఊర్కొండలో 33.3, నాగర్‌కర్నూల్‌లో 32.9, వెల్దండ లో 25.9, ఉప్పునుంతలలో 14.8, కల్వకుర్తి లో 13.3, పెద్దకొత్తపల్లిలో 10.0, మిల్లీమీటర్ల వర్షం కురిసింది.