Share News

రఘునాథ్‌గౌడ్‌ను వెంటనే అరెస్టు చేయాలి

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:22 PM

ప్రేమ పేరుతో యువతిని మోగించి ఆత్మహ త్యకు కారకుడైన కానిస్టేబుల్‌ రఘునాథ్‌ గౌడ్‌ను వెంటనే అరెస్టు చేయాలని దళిత, ప్రజాసం ఘాల నాయకుల డిమాండ్‌ చేశారు.

రఘునాథ్‌గౌడ్‌ను వెంటనే అరెస్టు చేయాలి
కొవ్వొత్తుల ర్యాలీ నిర్వస్తున్నదళిత, ప్రజాసంఘాల నాయకులు

  • దళిత, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్‌

  • ప్రియాంక మృతికి కొవ్వొత్తుల ర్యాలీతో సంతాపం

గద్వాలటౌన్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో యువతిని మోగించి ఆత్మహ త్యకు కారకుడైన కానిస్టేబుల్‌ రఘునాథ్‌ గౌడ్‌ను వెంటనే అరెస్టు చేయాలని దళిత, ప్రజాసం ఘాల నాయకుల డిమాండ్‌ చేశారు. ఆదివా రం పట్టణంలోని స్మృతివనంలో విలేకరులతో మాట్లాడిన నాయకులు, గడచిన మూ డు నెలలుగా తనకు న్యాయం జరగాలని పోరాడుతున్న యువతి ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడటం విచారకరమ న్నారు. గతంలోనే పోలీసులు నిందితు డిని కఠినంగా శిక్షించి ఉంటే ఇంతటి ఘాతుకం జరిగేది కాదన్నారు. ఉన్న తాధికారులు తక్షణం స్పందించి నిందితుడిని వెంటనే అరెస్టు చేయడంతో పాటు కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం ప్రి యాంక మృతికి సంతాప సూచకంగా పట్టణం లోని కృష్ణవేణి చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో బహుజన రాజ్య సమితి, స్వేరోస్‌, బీఎస్పీ, దళిత, మైనార్టీ సంఘాల నాయకులు వాల్మీకి, మోహన్‌, రాజు, సునందం, ప్రవీణ్‌, వేమన్న, సాదతుల్లా ఉన్నారు.

Updated Date - Oct 05 , 2025 | 11:22 PM