పీయూలో ర్యాగింగ్
ABN , Publish Date - Nov 14 , 2025 | 11:46 PM
: పాలమూరు యూనివర్సిటీని ర్యాగింగ్ భూతం వేధిస్తోందని యూనివర్సిటీకి కొత్తగా వచ్చిన విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలోని అన్ని విభాగాలలో సీనియర్లు జూనియర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది.
చెప్పినట్లు వినాలని జూనియర్లకు సీనియర్ల ఆర్డర్
వీడియోలు తీసి వెక్కిరింపులు
వినకపోతే బెదిరింపులు
ఓ జూనియర్ విద్యార్థి షర్ట్ హ్యాండ్ పైకి మడత పెట్టుకున్నాడని సీనియర్ల గొడవ
ఫిర్యాదు చేసినా పట్టని వర్సిటీ అధికారులు
పాలమూరు యూనివర్సిటీ , నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పాలమూరు యూనివర్సిటీని ర్యాగింగ్ భూతం వేధిస్తోందని యూనివర్సిటీకి కొత్తగా వచ్చిన విద్యార్థులు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలోని అన్ని విభాగాలలో సీనియర్లు జూనియర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. గురువారం రాత్రి భోజన సమయంలో పీజీ హాస్టల్‌లో ఓ జూనియర్ విద్యార్థి షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకున్నాడు. సీనియర్ల ముందు షర్ట్ హ్యాండ్స్ పైకి మడచవద్దని సీనియర్స్ అతని హెచ్చరించారు. అతను నా ఇష్టం అనడంతో పలువురు కొందరు సీనియర్లు అతనితో వాగ్వాదానికి దిగారు. కొందరు జూనియర్లు కల్పించుకొని సారీ చెప్పారు. ఈ విషయమై వర్సిటీలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు ఓ విద్యార్థి మీడియాతో పాటు పీయూ రిజిస్ర్టార్ చెప్పినట్లు సమాచారం.
రోజూ రాత్రి భోజనం చేశాక
రోజూ రాత్రి భోజనం చేశాక అటు బాలికల, ఇటు బాలుర హాస్టళ్లలో సీనియర్లు జూనియర్లను ఒక రూంలోకి చేరి, కొత్తగా వచ్చిన వారిని ర్యాంగింగ్ చేస్తున్నారని సమాచారం. మిమిక్రీ, డ్యాన్స్ చేయాలని, వేషధారణ చేసుకోవాలని చెప్పి వీడియోలు ఈ విషయమై ఓ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పీయూ అధికారులకు వినతి పత్రం ఇవ్వగా అధికారులు పట్టించుకోలేదని తెలిసింది. పీయూలో ఇటీవల లా, ఇంజనీరింగ్ విభాలతోపాటు, ఫార్మసీ, పీజీ కోర్సులలో అన్ని విభాగాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వారం పది రోజులుగా పీయూలోని అన్ని హాస్టల్స్‌లో ర్యాగింగ్ చేస్తున్నట్లు కొత్తగా వచ్చిన విద్యార్థులు చెబుతున్నారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
పీయూలో ఇప్పటికైతే ర్యాగింగ్ లేదు. విద్యార్థుల మధ్య మనస్పర్థలు వచ్చి ర్యాగింగ్ అని పుకార్లు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ర్యాగింగ్ జరుగుతున్నట్లు మాదృష్టికి రాలేదు. ఒకవేళ అలాంటిది ఉంటే సహించేది లేదు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు సోదర భావంతో ఉండాలి. చదువుపై శ్రద్థ పెట్టాలి. ఏవైన సమస్యలుంటే మా దృష్టికి తేవాలి.
- పూస రమేష్ బాబు, పీయూ రిజిస్ర్టార్