Share News

ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Aug 04 , 2025 | 10:58 PM

ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణంలో నాణ్యతపై రాజీ పడకుండా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతి న పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌ సంతోష్‌

- జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ బీఎం సంతోష్‌

గద్వాల టౌన్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణంలో నాణ్యతపై రాజీ పడకుండా ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతి న పూర్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 14వ వార్డు పరిధి గం జిపేటలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల ప నులను సోమవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడి న కలెక్టర్‌, నిబంధనల మేరకు 600 చదరపు అడుగులలోపే ఇంటిని ఎలా నిర్మించుకోవాలో లబ్ధిదారులకు స్పష్టంగా వివరించాలని అధికారుల కు సూచించారు. నిర్మాణాలకు అ వసరమై ఇసుక, మట్టిని లబ్ధిదారు ల కు అందజేయాలన్నారు. పనులు త్వ రగా పూర్తిచేసేలా అవగాహన కల్పిం చాలన్నారు. పూర్తయిన పనుల ఫొ టోలను సేకరించి లబ్ధిదారుల ఖాతా ల్లో డబ్బు నేరుగా జమఅయ్యేలా చూడాలన్నారు. కలెక్టర్‌ వెంట ముని సిపల్‌ కమిషనర్‌ దశరథ్‌, హౌసింగ్‌ పీడీ కాశీనాథ్‌ ఉన్నారు.

Updated Date - Aug 04 , 2025 | 10:58 PM