Share News

కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:51 PM

కొనుగోలు సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వా హకులకు ఆర్డీవో సుబ్రహ్మణ్యం సూచించారు.

కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

వనపర్తి రూరల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వా హకులకు ఆర్డీవో సుబ్రహ్మణ్యం సూచించారు. గురువారం వనపర్తి పట్టణ పరిధిలోని నాగవ రం రైతు వేదికలో వరి ధన్యాం కొనుగోలు కేం ద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. ధాన్యం కొనుగోలు సమయంలో చెత్త తాలు 1 శాతం, మట్టిపెల్లలు 1 శాతం, చెడిపోయిన రంగు మారిన, మొలకెత్తిన మరియు పురుగు తిన్న ధాన్యం 5 శాతం పూర్తిగా తయారు కాని ధాన్యం 3 శాతం, తక్కువ రకం ధాన్యం 6 శా తం పరిధి మించకుండా ఉండేలా చూడాలన్నా రు. సన్న రకానికి తేమ 14 శాతం, దొడ్డు రకా నికి 17శాతం లోపు ఉండేలా చూసుకోవాలని సూచించారు. తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, కురుమ య్య, భూక్య నాయక్‌, బుచ్చన్న, వ్యవసాయ, వి స్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:51 PM