Share News

నాణ్యమైన విత్తనాలే రైతులకు నిజమైన నేస్తం

ABN , Publish Date - Jun 03 , 2025 | 11:28 PM

‘నాణ్యమై న విత్తనం.. రైతన్నకు నేస్తం’లో భాగంగా మంగళవారం మరికల్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైౖతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పించారు.

నాణ్యమైన విత్తనాలే రైతులకు నిజమైన నేస్తం
కొత్తపల్లి మండలం ఎక్కమేడు రైతువేదికలో విత్తనాలను పంపిణీ చేస్తున్న అధికారులు, నాయకులు

మరికల్‌/మాగనూరు/కోస్గి రూరల్‌/కొత్తపల్లి/ధన్వాడ/కృష్ణ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ‘నాణ్యమై న విత్తనం.. రైతన్నకు నేస్తం’లో భాగంగా మంగళవారం మరికల్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రైౖతులకు నాణ్యమైన విత్తనాలపై అవగాహన కల్పించారు. పీజేటీఎస్‌ఏయూ శాస్త్రవేత్త అనిల్‌కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రైతులు పండించిన నాణ్యమైన విత్తనాన్ని గ్రామ స్థాయిలోనే ఇతరులకు ఇవ్వ డం ద్వారా కల్తీ విత్తనాల బారిన పడకుండా ఉంటారన్నారు. కార్యక్రమంలో ధన్వాడ పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకట్రామారెడ్డి, ఏవో రహమాన్‌, ఏఈవోలు పరుశురాం, వహీదాబేగం, శివకుమార్‌, వివిధ గ్రామాల అభ్యుదయ రైతులు పెంట మీది నర్సిములు, పటేల్‌శ్రీను, మల్‌రెడ్డి, విష్ణు వర్ధన్‌రెడ్డి తదితరులున్నారు.

అదేవిధంగా, మాగనూరు మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన ‘నాణ్యమైన విత్తనం, రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ ఈశ్వర్‌రెడ్డి పాల్గొని, మాట్లాడారు. మండలంలోని ప్రతీ గ్రామంలో ముగ్గురు రైతులకు నాణ్యమైన 35 కిట్లు వరి విత్తనాలు, 25 కిట్లు కంది పంటలకు సం బంధించిన విత్తనాలను పంపిణీ చేసినట్లు ఇన్‌ చార్జి ఏవో సుదర్శన్‌గౌడ్‌ తెలిపారు. పరిశోధన కేంద్రం ద్వారా పంపిణీ చేస్తున్న విత్తనాల సాంకేతికను పాటిస్తే అదే విత్తనాన్ని రెండు, మూడు సంవత్సరాల వరకు వాడుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, రమేష్‌గౌడ్‌, అశోక్‌గౌడ్‌, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

గుండుమాల్‌ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం విత్తనోత్పత్తిపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ‘నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం’ కార్యక్రమం ముఖ్య ఉద్ధేశాన్ని వారు రైతుల కు వివరించారు. అనంతరం వరి, కంది, జొన్న పంటలకు సంబంధించిన విత్తనాల మినీ కిట్స్‌ను రైతులకు అందించారు. శాస్త్రవేత్త శేఖర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, ఏఈవోలు తిరుపతి, హర్షవర్ధన్‌, నాయకులు పా ల్గొన్నారు.

కొత్తపల్లి మండలంలోని లింగాల్‌చేడ్‌ రైతువేదికలో మంగళవారం ఏవో రమేష్‌ రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి, మాట్లాడారు. ఏఈవో మోహన్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ధన్వాడ రైతువేదికలో రైతులకు విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 27 మంది రైతులకు పాలిటెక్నిక్‌ శాస్త్రవే త్త డాక్టర్‌ జేడీ.సరిత కల్తీలేని విత్తనాలను అందించారు. విండో చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, వ్యవ సాయాధికారి నవీన్‌కుమార్‌, ఏఈవోలు సైమన్‌, భరద్వాజ్‌, జైన్‌సింగ్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కృష్ణ మండల కేంద్రంలోని రైతువేదిక భవనంలో మంగళవారం పాలెం వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఈశ్వర్‌రెడ్డి రైతులకు విత్తనాలు పంపిణీ చేసి, మాట్లాడారు. ఏవో సుదర్శన్‌గౌడ్‌, ఏఈవో అభిలాష్‌, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 03 , 2025 | 11:28 PM