Share News

నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Aug 06 , 2025 | 10:45 PM

మండలంలోని యన్మన్‌గండ్ల ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కలెక్టర్‌ విజయేందిర బోయి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్‌
యన్మనగండ్ల జూనియర్‌ కళాశాల విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌

నవాబ్‌పేట, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని యన్మన్‌గండ్ల ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను కలెక్టర్‌ విజయేందిర బోయి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలోని ఫ్యాన్‌కు రెగ్యులేటర్‌ ఏర్పాటు చేయించాలని, మరుగుదొడ్డి మరమ్మతు చేసి, నీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని, పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. లైబ్రరీని వినియోగించుకునేలా చూడాలన్నారు. పాఠశాల ఆవరణలో చెత్త పేరుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జూనియర్‌ కళాశాలను తనిఖీ చేశారు. మరుగుదొడ్లు లేవని విద్యార్థులు చెప్పడంతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Aug 06 , 2025 | 10:45 PM