Share News

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:34 PM

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం
కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న మంత్రి వాకిటి శ్రీహరి

- పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

- ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పురోగతిపై సమీక్ష

ఆత్మకూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకునే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మార్కె ట్‌ కార్యాలయ ఆవరణలో సంబంధిత అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని 14 గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు ఎంత మంది ప్రారంభించాలని, ప్రారంభించక పోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారికి తక్షణమే బిల్లులు చెల్లించే విధంగా అఽధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఇసుక కొరత ఉందని ఆయా గ్రామాల లబ్ధిదారులు మంత్రికి విన్నవించడంతో కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లా డారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న రోజే ఇసుక రవాణా చేసే విధంగా చూడా లని కలెక్టర్‌ను కోరారు. మక్తల్‌ నియోజకవర్గంలో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసు కుంటే మరో 3,500 ఇళ్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అలాగే రైతులు పండించిన ప్రతీ ధాన్యంపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులు దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లు గీతా కార్మిక సం ఘం అధ్యక్షుడు నాగరాజు గౌడ్‌, తహసీల్దార్‌ చాంద్‌పాషా, మునిసిపల్‌ కమిషనర్‌ శశిధర్‌, ఎంపీడీవో శ్రీపాద ఆత్మకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రహమతుల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:34 PM