ప్రజల భద్రత పోలీసుల లక్ష్యం
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:25 PM
ప్రజల భద్రత పోలీసుల లక్ష్యం అని నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రాంలాల్ అన్నారు.
- డీఎస్పీ నల్లపు లింగయ్య
- మక్తల్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్
మక్తల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ప్రజల భద్రత పోలీసుల లక్ష్యం అని నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రాంలాల్ అన్నారు. మంగళవారం ఉదయం పట్టణంలోని ఆజాద్‌నగర్, రెడ్డినగర్, బురాన్‌గడ్డ కాలనీల్లో తెల్లవారుజామున 6 నుం చి 8:30 గంటల వరకు డీఎస్పీ లింగయ్య ఆధ్వర్యంలో ఒక సీఐ, ఏడు మంది ఎస్సైలు, ఆరుమంది హెడ్‌కానిస్టేబుళ్లు, మొత్తం 75మంది పోలీస్ సిబ్బందితో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్(కార్డెన్‌సెర్చ్) నిర్వహించారు. మొత్తం ఏడు బృందాలుగా విడిపోయి ఆజాద్‌నగర్, రెడ్డినగర్, బురాన్ గడ్డలో 350 ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నెంబర్ ప్లేట్లు, సరైన పత్రాలు లేని కారణంగా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని, నేరాల నిర్మూలన కోసం కార్డెన్‌సెర్చ్ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్సైలు భాగ్యలక్ష్మీరెడ్డి, అశోక్‌బాబు, నవీద్, కృ ష్ణంరాజు, రాముడు, రాజశేఖర్, శివశంకర్, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.