కవి అందెశ్రీకి ప్రజా సంఘాల నివాళి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:25 PM
తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగా ణ’ రచయిత అందెశ్రీ మృతి బాధాకరమని ప్రి న్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అన్నారు.
గద్వాల టౌన్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగా ణ’ రచయిత అందెశ్రీ మృతి బాధాకరమని ప్రి న్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డి గ్రీ కళాశాలో సోమవారం తెలంగాణ రాష్ట్ర గీ తం రచయిత, తెలంగాణ ఉద్యమ నాయకుడు దివంగత డాక్టర్ అందెశ్రీ చిత్రపటానికి ప్రిన్సిపా ల్, అధ్యాపకులు నివాళులర్పించారు. అందెశ్రీ రాసిన ‘మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడు’... అనే గేయాన్ని డిగ్రీ పాఠ్యాంశంలో చేర్చారని అన్నారు. ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’... తెలంగాణ మాతృగీతంతో పాటు అనేక గేయాలు రచించి తెలంగాణ ప్ర జ ల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచారన్నా రు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమో హన్, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ రాధిక, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సురేం దర్‌రెడ్డి, అధ్యాపకులు ఉన్నారు.
ఎన్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో..
తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రచించిన కవి అందెశ్రీ మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు అని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జి ల్లా చైర్మన్ రంజిత్‌కుమార్ కీర్తించారు. కవి అందెశ్రీ మృతికి సంతాప సూచికంగా సోమవా రం పట్టణంలోని సమితి కార్యాలయంలో దివం గత కవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళు లర్పించారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బుచ్చి బాబు, విష్ణు, ప్రేమ్‌రాజ్, మీసాల కిష్టన్న, లక్ష్మ న్న, నేతన్న, కార్తీక్, చిన్నరాముడు, గొర్ల తిమ్మ ప్ప, దొడ్డన్న, రమేశ్ ఉన్నారు.
ప్రజాసంఘాల ఆధ్వర్యంలో..
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన కవి అం దెశ్రీ మృతి పట్ల పార్టీలు, ప్రజాసంఘాల నా యకులు శ్రద్ధాంజలి ఘటించారు. సోమవా రం రాత్రి పట్టణంలోని కృష్ణవేణిచౌక్ వద్ద అందెశ్రీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈసందర్బం గా మాట్లాడిన వక్తలు, అందెశ్రీ మృతి తెలంగా ణకు, సాహిత్యానికి తీరలి లోటన్నారు. కార్య క్రమంలో నాగర్‌దొడ్డి వెంకట్రాములు, మధుసూ దన్‌బాబు, ఆర్.మోహన్, ఆంజనేయులు, వెంక టస్వామి, శంకర ప్రభాకర్, వాల్మీకి డ్యాం వెంక టన్న, కురువ పల్లయ్య, నరసింహ, మేళ్లచెరువు వర్షిత్, స్వేరోస్ కరుణాకర్, నాగన్న, నందిన్నె వెంకటేశ్, పరమేశ్, యూనిస్, భీమన్న ఉన్నారు.