Share News

ఉపాఽధి పనులపై బహిరంగ విచారణ

ABN , Publish Date - Oct 17 , 2025 | 11:19 PM

జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్వహించిన ఉపాధి పనులపై శుక్రవారం ఇటిక్యాల మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు ఆద్వర్యంలో బహిరంగ విచారణ నిర్వహించారు.

 ఉపాఽధి పనులపై బహిరంగ విచారణ

- రూ.2.50 లక్షల రికవరీ, ఆరుగురికి షోకాజ్‌ నోటీసు

గద్వాల, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి) జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్వహించిన ఉపాధి పనులపై శుక్రవారం ఇటిక్యాల మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు ఆద్వర్యంలో బహిరంగ విచారణ నిర్వహించారు. ఇటిక్యాల మండలంలో మొత్తం 29 గ్రామ పంచాయతీలు ఉండగా గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు నిర్వహించిన 7.32కోట్ల పనులపై ఆడిట్‌ నిర్వహించారు. స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ ముత్తయ్య ఆధ్వర్యంలో 10రోజుల పాటు గ్రామాల్లో అతర్గత ఆడిట్‌ నిర్వహించారు. అదేవిధంగా పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రూ.97లక్షల నిధులపై కూడా ఆడిట్‌ నిర్వహించారు. వీటన్నింటిపై జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు బహిరంగ విచారణ నిర్వహించారు. రాత్రి 8గంటల వరకు 26 గ్రామాల బహిరంగ విచారణ నిర్వహించారు. మొత్తం రూ.2.55లక్షల రికవరీలు, ఫైన్‌లు వేశారు. ఉపాధి నిబంధనలు పాటించకుండా పనులు నిర్వహించిన ఆరుగురికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇంకా మూడు గ్రామాలపై ఆడిట్‌ కొనసాగుతున్నది. ఉపాధి పనుల బహిరంగ విచారణలోని అంశాలను పూర్తిస్థాయిలో శనివారం వెల్లడిస్తామని వారు తెలిపారు. ఎంపీడీవో అజార్‌ మోహినుద్దీన్‌, ఎర్రవల్లి ఎంపీడీవో రశీద్‌ అహ్మద్‌, ఏపీడీ శ్రీనివాస్‌, ఏపీవో శివజ్యోతి తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 17 , 2025 | 11:19 PM