Share News

సాంకేతిక సౌకర్యాలను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:26 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన రంగంలో అందుబాటులో వస్తున్న నూతన సాంకేతిక సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా అన్నారు.

సాంకేతిక సౌకర్యాలను అందిపుచ్చుకోవాలి

  • ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా

గద్వాలటౌన్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన రంగంలో అందుబాటులో వస్తున్న నూతన సాంకేతిక సౌకర్యాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షేక్‌ కలందర్‌ బాషా అన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ విద్యార్థుల కోసం అమలు చేయనున్న ఈ-కంటెంట్‌ను ప్రిన్సిపాల్‌ లాంచనంగా ప్రారంభించారు. కంటెంట్‌లోని అంశాలు, బోధనపరంగా వాటిని వినియోగించుకునే విధానం, తద్వారా ఆంగ్ల భాషాపరంగా పొందే అదనపు ప్రయోజనాల గురించి రిటైర్డ్‌ ఆంగ్ల అధ్యాపకుడు కృష్ణమూర్తి వివరించారు. ఈ కంటెంట్‌ ద్వారా ఆంగ్లభాషకు సంబంధించిన సాహిత్యం, అధ్య యన అంశాలు, పరీక్షలకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ సాఫ్ట్‌ కాపీ ద్వారా విద్యార్థుల మొబైళ్లకు వాట్సప్‌ గ్రూల ద్వారా అందుబాటు లోకి వస్తుందని వివరించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్‌ రాధిక, అధ్యాపకులు హరినాగభూషణం, మల్లికార్జున్‌ గౌడ్‌, డాక్టర్‌ రాములు, డాక్టర్‌ పరశురామ్‌, లలిత ఉన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:26 PM