నాణ్యమైన భోజనం అందించాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:12 PM
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
కలెక్టర్ విజయేందిన బోయి
గండీడ్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. గురువారం మండలంలోని సల్కర్‌పేట్ గ్రామంలో రెండు అంగన్‌వాడీ సెంటర్లతో పాటు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థులకు అక్షరాలు రాయడం, చదవడాన్ని పరిశీలించారు. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, వెజిటేబుల్ కర్రీ పలుచగా నీళ్లలాగ ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్టోర్ రూమ్‌లో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ సెంటర్లలో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంచన్‌పల్లి గేటు దగ్గర టోల్ గేటుకు కేటాయించిన 301, 303 సర్వే నంబర్లలో భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్ మల్లికార్జున్‌రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.