Share News

సరైన సమయంలో పౌష్టికాహారం అందించాలి

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:16 PM

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు సరైన సమయంలో పౌష్టికాహారం అందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

సరైన సమయంలో పౌష్టికాహారం అందించాలి

  • గంజిపేట అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌ సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు సరైన సమయంలో పౌష్టికాహారం అందించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని గంజిపేట అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. సెంటర్‌లో ఉన్న పిల్లలు, తల్లులు, బాలింతులకు అం దుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బాలలకు మంచి విద్యను అంది ంచి వారి పునాదులు మరింత బలోపేతం చేయాలన్నారు. డేటా నమోదు కోసం ఉపయోగిస్తున్న మొబైల్‌ యాప్‌ను తనిఖీ చేసి సమాచా రం నిబంధనల ప్రకారం కచ్చితంగా నమోదు చేయాలన్నారు. పిల్లల్లో సామ్‌, మ్యామ్‌ లాంటి పోషకాహార లోపాలు ఏర్పడకుండా వారికి సమతుల్యమైన పోషణ అందించి, ఆరోగ్యంగా ఉండే లా చూడాలన్నారు. పోషన్‌ ట్రాకర్‌, ఎన్‌హెచ్‌టీఎస్‌ యాప్‌లలో సమాచారం ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. గర్భిణుల ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగిస్తూ, వారికి అవసరమైన పోషకాహారంపై అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఎలాంటి ఇబ్బం దులు కలుగుకుండా చూడాలని, మంచి ఆహా రం, పరిశుభ్రత, అవసరమైన సదుపాయాలు కల్పి స్తూ కేంద్రాన్ని సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు రజియా, లక్ష్మి ఉన్నారు.

Updated Date - Aug 05 , 2025 | 11:16 PM