Share News

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:41 PM

క్రమ శిక్షణతో పని చే స్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని జోగుళాంబ జోన్‌-7 డీఐజీ ఎల్‌.ఎస్‌.చౌహాన్‌ పోలీసులకు సూచించారు.

ప్రజలకు మెరుగైన సేవలందించాలి
మాగనూరు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్క నాటుతున్న డీఐజీ

- జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌

మాగనూరు/మక్తల్‌/నర్వ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): క్రమ శిక్షణతో పని చే స్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని జోగుళాంబ జోన్‌-7 డీఐజీ ఎల్‌.ఎస్‌.చౌహాన్‌ పోలీసులకు సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలో ని పోలీస్‌ స్టేషన్‌లో తనిఖీ చేశారు. ముం దుగా పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీక రించారు. పోలీస్‌ ఆవరణలో మొక్కలు నా టారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను, రికార్డు లను పరిశీలించారు. సిబ్బందితో డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు ఇంకా చేరువయ్యే విధంగా విలేజ్‌ పోలీస్‌ ఆఫీసర్స్‌ గ్రామాల్లో పర్యటిస్తూ సేవలందించాలన్నారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠినంగా వ్యవ హరించాలన్నారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. నారాయ ణపేట డీఎస్పీ న ల్లపు లింగయ్య, సీఐ రాంలాల్‌, ఎస్‌ఐ అ శోక్‌బాబు, ఏఎన్‌ఐ మన్నన్‌, పోలీస్‌ సి బ్బంది పాల్గొన్నారు.ఫ మక్తల్‌లో ఎ స్పీ యోగేష్‌ గౌతమ్‌ తో కలిసి డీఐజీ ఎల్‌ ఎస్‌ చౌహాన్‌ వార్షిక తనిఖీ నిర్వహించి మాట్లాడారు. విలేజ్‌ పోలీసులు తమకు కేటాయించిన గ్రామాల్లో విధిగా పర్యటించా లన్నారు. అనంతరం మక్తల్‌ పోలీస్‌స్టేషన్‌ లో మొక్కలు నాటి పోలీసుల పనితీరు, రికార్డుల నిర్వహణ, ప్రజాసేవలపై విపులం గా సమీక్షించారు.

డీఎస్పీ ఎన్‌.లింగయ్య, సీఐ రాంలాల్‌, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.

నర్వ పోలీస్‌ స్టేషన్‌కు మంగళవా రం జోగుళాంబ జోన్‌ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌ హాన్‌ నర్వ సర్కిల్‌ ఆఫీస్‌ను తనిఖీ చేశా రు. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం సర్కిల్‌ ఆఫీస్‌ రికార్డు లను పరిశీలించారు. తనిఖీల్లో డీఎస్పీ న ల్లపు లింగయ్య, సీఐ రాజేందర్‌ రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 11:41 PM