Share News

మామిడికి రక్షణ కవచం

ABN , Publish Date - Mar 09 , 2025 | 11:49 PM

ఇటీవల కాలంలో మామిడి రైతులను తెగుళ్ల బెడద తీవ్రంగా వేధిస్తోంది.

మామిడికి రక్షణ కవచం

- తెగుళ్ల నుంచి కాపాడేందుకు కాయలకు కవర్లు కడుతున్న రైతులు

- నాణ్యమైన దిగుబడి రావడంతో మార్కెట్లో భలే డిమాండ్‌

- సబ్సిడీపై కవర్లు అందిస్తున్న ప్రభుత్వం

పెబ్బేరు రూరల్‌, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కాలంలో మామిడి రైతులను తెగుళ్ల బెడద తీవ్రంగా వేధిస్తోంది. మామాడి కాయల కు నల్లతామర, పండు ఈగ, తేనె మంచు, మసి తెగులు, బంక తెగుళ్ల నుంచి కాయలను కాపాడుకునేందుకు రక్షణ కవర్లు కడుతున్నారు. మామిడి కాయలు నిమ్మకాయ సైజులు వచ్చినప్పుడు కవర్లను కట్టాలి. కవర్లు తొడిగిన మామిడి కాయలు 70 రోజుల తర్వాత నాణ్యతగా దిగుబడి వస్తున్నాయి. నిల్వ, రవాణ సందర్భాల్లో తొందరగా పాడవకుండా ఉంటాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉండటంతో అధిక ధర వస్తుంది. కవర్లు కట్టిన తర్వాత ఏ కాయలు ఎప్పుడు కోతకు వస్తాయి అనేది గుర్తు పట్టుకునేందుకు కవర్లపై గుర్తులు వేసుకోవాలి. దీంతో ఉద్యాన శాఖ అధికారులు 50 శాతం రాయితీతో కవర్లు అందిస్తోంది. ఒక్కొక్క కవరు ధర రూ.2.25 ఉంటుంది. ఎకరాకు 4 వేల నుంచి 8 వేల కవర్లు అందిస్తోంది. రైతులు పట్టాపాస్‌బుక్‌ జిరాక్స్‌, ఆధార్‌, బ్యాంక్‌ అకౌంట్‌ జిరాక్స్‌, పాస్‌ పోర్టు సైజు ఫొటో, దరఖాస్తు ఫారం ఉద్యాన శాఖ అధికారులకు అందజేయాలి. జిల్లా వ్యా ప్తంగా 14వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్న ట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు రైతులకు జిల్లా వ్యాప్తంగా 5.50 లక్షల కవర్లను అందించగా, 3.60 లక్షల కవర్లు కావాలని కంపెనీ అధికారులను కోరినట్లు ఉద్యానశాఖ అధికారులు తెలియజేస్తున్నారు.

రైతుల ప్రయోజనాల కోసమే..

జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులు మామిడి కాయలను కాపా డుకునేందుకు సబ్సిడీపై కవర్లను అందిస్తు న్నాం. మామిడి కాయలకు కవర్లను తొడిగిం చడంతో కాయలు నాణ్యతగా ఉంటాయి. దీంతో మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంటుంది.

- కృష్ణయ్య, ఉద్యానశాఖ అధికారి, పెబ్బేరు

Updated Date - Mar 09 , 2025 | 11:49 PM