హక్కులను కాపాడుకోవాలి
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:23 PM
చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని జోగుళాంబ గద్వాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు.
గద్వాల సర్కిల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరునిపై ఉందని జోగుళాంబ గద్వాల జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు. గద్వాలలోని జమ్మిచేడులో బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. హాజరైన డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణస్వామి, శ్రీనివాసులు మానవ హక్కుల ప్రాధాన్యత, రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులతో పాటు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలు పొందాల్సిన న్యాయ సహాయ పథకాలను వివరించారు. హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం తదితర మానవ హక్కుల విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందని హితవు పలికారు. కార్యక్రమంలో పారా లీగల్ వలంటీర్స్ అనురాధ, పరశురాముడు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.