Share News

100 పడకలకు పెంపుకోసం ప్రతిపాదనలు

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:06 PM

‘ఒకే బెడ్‌పై నలుగురు రోగులు’ అన్న శీర్శికన మద్దూర్‌ సామాజిక ఆరోగ్య కేం ద్రంలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 9న ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. కాడా అధికారి వెంకట్‌రెడ్డి సోమవారం ఆస్పత్రిని సందర్శించి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు.

100 పడకలకు పెంపుకోసం ప్రతిపాదనలు
రోగులతో మాట్లాడుతున్న కాడా అధికారి వెంకట్‌రెడ్డి

కాడా అధికారి వెంకట్‌రెడ్డి

మద్దూర్‌ సీహెచ్‌సీ పరిశీలన

మద్దూర్‌, ఆగస్టు 11(ఆంఽధ్రజ్యోతి): ‘ఒకే బెడ్‌పై నలుగురు రోగులు’ అన్న శీర్శికన మద్దూర్‌ సామాజిక ఆరోగ్య కేం ద్రంలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ‘ఆంధ్రజ్యోతి’లో ఈ నెల 9న ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. కాడా అధికారి వెంకట్‌రెడ్డి సోమవారం ఆస్పత్రిని సందర్శించి, రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. ఆస్పత్రిని 100 పడకలకు పెం చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపు తామన్నారు. దవాఖానాలో అన్ని వార్డులను తిరిగి పరిశీలించారు. ఒకే బెడ్‌పై ఇద్దరు నుంచి ముగ్గురు రోగులు ఉండటాన్ని చూసి రోగుల తాకిడి ఇంత ఉండడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి?, వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అని ఆర్‌ఎంవో పావనిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వైద్య విధాన పరిషత్‌ పరిధిలో లేని కారణంగా పోస్టులు భర్తీ కావడం లేదన్నారు. దాంతో వైద్యులు డిపుటేషన్‌పై పని చేస్తున్నారన్నారు. ఫొటో థెరఫీ, స్కానింగ్‌ మిషన్లు కావాలని, జనరేటర్‌ లేకపోవడంతో ఆపరేషన్‌ సమయంలో కరెంట్‌ పోతే ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. తాగునీటి సమస్య కూడా ఉందన్నారు. మద్దూర్‌తో పాటు చుట్టు పక్కల మండలాల్లోని పలు గ్రామాల రోగులు ఆస్పత్రికి వస్తారన్నారు. నిత్యం ఎంత మంది రోగులు వస్తుంటారో ఆ ఇండెంట్‌ ఇవ్వాలని కాడా అధికారి సూచించారు. ఆస్పత్రిని 100 పడకలకు పెంచాలని పీఏసీఎస్‌ అధ్యక్షుడు నర్సింహ కాడా అధికారికి విన్నవించారు. దాంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు కాడా అధికారి తెలిపారు.

Updated Date - Aug 11 , 2025 | 11:06 PM