ఘనంగా మహ్మద్ ప్రవక్త జయంతి
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:28 PM
మునిసిపాలిటీ పరిఽధిలోని మూడు మసీదుల్లో ఆదివారం ముస్లిం సోదరులు మహ్మద్ ప్రవక్త జయంతిని ఘనంగా జరుపుకున్నారు.
భూత్పూర్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : మునిసిపాలిటీ పరిఽధిలోని మూడు మసీదుల్లో ఆదివారం ముస్లిం సోదరులు మహ్మద్ ప్రవక్త జయంతిని ఘనంగా జరుపుకున్నారు. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా జామియా మసీదు, మదినా మసీదు, రహమాత్ నవజవాన్ కమిటీ ఆధ్వర్యంలో పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో 58 యూనిట్ల రక్తదానం చేశారు. అదే విధంగా అన్నదానం చేశారు. ముస్లిం, మైనార్టీ నాయకులు సర్ఫుద్ధీన్, అహ్మద్, యాసిన్‌పాషా, ఖాసీం, జాహంగీర్, నయూం, అప్సర్, జమీర్, ఎండీ.వహీద్, అసద్, సాబేర్, రహమత్, అక్తర్, ఖాదర్, ఖదీర్, సాబేర్, ఎస్‌ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు.