కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:53 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గానికి ఆయా సందర్భంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటస్వా మి డిమాండ్ చేశారు.
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి
గద్వాల టౌన్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గానికి ఆయా సందర్భంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఐటీయూ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటస్వా మి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ జిల్లా స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించా రు. ఈ సందర్బంగా మాట్లాడిన వెంకటస్వామి, కనీస వేతనాల అమలు, కార్మిక హక్కుల పరి రక్షణ, ఉపాధికి భద్రత, సామాజిక పథకాల అ మలుతో పాటు అనేక వాగ్ధానాలు చేసినా ఇప్ప టివరకు అమలు చేయలేదన్నారు. అదే సంద ర్భంలో కార్మిక చట్టాలను సవరిస్తూ హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తుండటం గర్హనీయమ న్నారు. సులభతర వాణిజ్యం పేరుతో కార్మికుల ను సేవకులుగా మార్చే ప్రయత్నం జరుగుతుం డటం శోఛనీయమన్నారు. గ్రామపంచాయతీ, మునిసిపల్, అంగన్‌వాడీ, ఆశా, ఐకేపీ తదితర యూనియన్లలో పనిచేసే వారికి కనీస వేతనా లు ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించా లన్నారు. ఐక్యపోరాటాల ద్వారా మాత్రమే కార్మి కులకు రక్షణ లభిస్తుందని, ఆ దిశగా అన్నిరం గాల్లోని కార్మికులందరూ ఏకం కావాలని పిలు పునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ, అనుబంధ సంఘాల నాయకులు బాలకృష్ణ, రంగన్న, నరేశ్, రామకృష్ణ, తిరుపతన్న, ఆంజనేయులు, రఘు, లక్ష్మన్న ఉన్నారు.