దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ABN , Publish Date - Nov 09 , 2025 | 11:55 PM
కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల ఎన్నికల డిక్లరేషన్‌లో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల ని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యపు రాధా కృష్ణ డిమాండ్ చేశారు.
వనపర్తి టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల ఎన్నికల డిక్లరేషన్‌లో దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాల ని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దయ్యపు రాధా కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేం ద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కుల వివ క్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ... గత ప్రభుత్వం కార్పొరేషన్ రుణాల ను విస్మరించిందని, దాంతో దళిత యువకులు ఉపాధి అవకాశాలకు దూరమయ్యారని వాపో యారు. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలను పునరుద్ధరించి దళిత యువతకు రు ణాలు మంజూరు చేసి ఉపాధి కల్పించేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. బెస్ట్ అవెలబుల్ స్కూ ళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో పాఠశాల యాజ మాన్యం విద్యార్థులను ఇబ్బందులకు గురి చే స్తుందని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజులు చెల్లించి మెరుగైన విద్య అందించేలా చర్యలు చే పట్టాలన్నారు. దేశంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని, ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌పై దాడి చేసిన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గంధం భగత్, నా యకులు వెంకట్రాములు, మురళీ, గట్టయ్య, బీ సన్న తదితరులు పాల్గొన్నారు.