లాభాల పూబంతి
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:05 PM
పూల సాగుతో పలువురు రైతులు లాభాలు అర్జిస్తున్నారు.
గండీడ్/మహమ్మదాబాద్, అక్టోబరు 19 (ఆంద్రజ్యోతి) : పూల సాగుతో పలువురు రైతులు లాభాలు అర్జిస్తున్నారు. బతుకమ్మ, దస రా, దీపావళి, కార్తీకమాసం పర్వదినాలను దృష్టిలో ఉంచుకొని తక్కువ పెట్టుబడితో బంతిపూల తోటలను సాగుచేసి లాభాలు గడిస్తున్నారు. ఏటా సాంప్రదాయ పంటలను వేసి అధిక పెట్టుబడి పెట్టి నష్టాల భారిన పడడంతో దిగులపడిన ఉమ్మడి గండీడ్ మండల పరిధిలోని లింగాయపల్లి, రంగారెడ్డిపల్లి, రుసుంపల్లి, కప్లాపూర్, జానంపల్లి, గోవింద్‌పల్లి, మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల, ముందలితండా, ముకర్లబాద్, నంచర్ల, వెంకట్‌రెడ్డిపల్లి, మహమ్మదాబాద్ గ్రామాల్లో రైతులు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటల వైపు దృష్టి సారించారు. కాగా రైతులు పండించిన పూలు కావల్సిన వారు తోటల దగ్గరకు వచ్చి తీసుకెళ్తుండ గా, మరికొన్ని పూలను జిల్లా కేంద్రానికి వెళ్లి రోడ్లపై కూర్చొని విక్రయించాల్సి వ స్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మండల కేంద్రాల్లో మార్కెట్ సౌకర్యం కల్పించి, రాయితీపై నారు పంపిణీ చేయాలని రైతులు కోరుతున్నారు.